1902 మార్చి 17

జార్జ్ డబ్ల్యూ. వారెన్ (1828-1902) గొప్ప అమెరికన్ ఆర్గానిస్ట్, స్వరకర్త, ఈయన “నేషనల్ హిమ్” అనే గీతం ట్యూన్కు పేరు పొందాడు. దీనిని చర్చిలు, దేశభక్తి కార్యక్రమాలలో పాడే ‘గాడ్ ఆఫ్ అవర్ ఫాదర్స్’ కోసం ఉపయోగిస్తారు. ఈయన న్యూయార్క్లోని ప్రముఖ చర్చి సంగీతకారుడు, అమెరికన్ పవిత్ర సంగీతం అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఈయన న్యూయార్క్లోని సెయింట్ థామస్, సెయింట్ బార్తోలోమ్యూస్, ఎపిస్కోపల్ చర్చిలలో ఆర్గనిస్ట్గా పనిచేశాడు. అక్కడ పాడిన వారెన్స్ హిమ్స్ ట్యూన్స్లో ఈయన కీర్తనలు, సేవా సంగీతం సంకలనం చేయబడ్డాయి.

1902 March 17

George W. Warren (1828–1902) was an American organist and composer best known for his hymn tune “National Hymn”, which is used for ‘God of Our Fathers’ which is sung in churches as well as patriotic events. He was a prominent church musician in New York and played a significant role in the development of American sacred music. He served as an organist at Episcopal churches in New York, including St. Thomas Church and St. Bartholomew’s Church.

1996 మార్చి 01

మైఖేల్ (1918-1996) తన స్వంత దేశమైన నైజీరియాలో క్రీస్తు పరిచర్యకు తనను తాను పూర్తిగా అంకితం చేసుకున్న దేవుని పరిచారకుడు. ఈయన చర్చిలను పునర్నిర్మించడం, విశ్వాసులను బలోపేతం చేయడంలో ప్రసిద్ధి చెందాడు. ఒకప్పుడు ప్రముఖ విజయవంతమైన వ్యాపారవేత్త, దేవుని పిలుపుకు సమాధానం ఇవ్వడానికి, మొత్తము విడిచిపెట్టి పరిచర్యలో సమర్థవంతంగా పనిచేశాడు. ఫోలోరున్షో హుస్విన్ నాయకత్వంలో నైజీరియన్ పెంటెకోస్టల్ మిషన్, వాయిస్ ఆఫ్ రిడంప్షన్ గోస్పెల్ చర్చ్లో పరిచర్య చేసేవాడు. ఒక క్రైస్తవుడు స్వర్గానికి చేరుకోకుండా అడ్డుకునే మూడు విషయాలు ఉన్నాయని, తన ప్రసంగాలలో నొక్కి చెప్పేవాడు.

1996 March 01

Michael Oluwamuyide Adegbolagun (1918-1996) was a dedicated minister of God who committed himself fully to the ministry of Christ. He was Known for rebuilding churches and strengthening congregations. Once a prominent and successful businessman, he left everything behind to answer God’s call and served effectively in the ministry. Until his passing in 1996, he held the position of Assistant General Overseer (AGO) at the Voice of Redemption Gospel Church, a Nigerian Pentecostal mission, under the leadership of Folorunsho Husswin. He emphasized in his sermons that there are three things that could hinder a Christian from reaching heaven.