1929 ఏప్రిల్ 19
సాధు సుందర్ సింగ్ (1889-1929) సిక్కు మతంలో పుట్టి యేసుక్రీస్తును స్వీకరించి, ప్రముఖ క్రైస్తవ మిషనరీగా మారిన ఈయన భారతదేశ క్రైస్తవులకు సుపరిచితులు. ముఖ్యముగా, సువార్త నిషేదిత దేశాలైన టిబెట్, నేపాల్ వంటి దుర్భర ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తూ రక్తము కారుచున్న పాదములతో, అననుకూల వాతావరణంలో కూడా పరిచర్య చేసిన గొప్ప సువార్తికుడు. ఈయన హిమాలయాలలో మొత్తం కాలినడకన చేసిన సేవ ఎంతో ఘనమైనది. కరడు గట్టిన బౌద్ధ సన్యాసిలకు, హిందూమత వాదులకు నేర్పుగా బోధించెడివాడు. ఈయన జైలులో వేయబడిన సందర్భాల్లో కూడా పౌలు, సీల వలె ప్రార్థనలు, పాటలతో ఇతర ఖైదీల జీవితానికి ధైర్య మిచ్చేవారు. అనేక సార్లు ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ, క్రైస్తవ విశ్వాసాన్ని ఏమాత్రము విడువలేదు.