1847 మార్చి 05
హన్నా మార్ష్ మన్ (1767–1847) భారతదేశానికి వచ్చిన మొదటి మహిళా మిషనరీలలో ఒకరు, ఈమె భర్త జాషువా మార్ష్‌మన్, విలియం క్యారీలతో పాటు సెరంపూర్ మిషన్ లో కీలక సభ్యురాలు. ఈమె భారతదేశంలో స్త్రీలకు విద్యనందించటంలో చాలా ముందున్నది. ఆ కాలములో నిర్లక్ష్యం చేయబడిన బాలికల బోధన కోసం ఎంతో వాదించింది. ఈమె విలియం క్యారీకి గొప్ప మద్దతు నిస్తూ, బైబిల్ అనువాద పనులలో, మిషనరీ కార్యకలాపాలలో చాలా సహాయం చేసింది. ఈ మిషన్‌కు ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా మద్దతు ఇవ్వడంలో ఈమె కీలక పాత్ర పోషించింది, ఈమె 1800లో ఒక పాఠశాలను ప్రారంభించి, ఇంగ్లీష్ పిల్లల కోసం రెండు బోర్డింగ్ పాఠశాలలను కూడా నిర్వహించింది, దీని ఫీజులు సెరాంపూర్ మిషన్‌ను కొనసాగించడంలో సహాయపడింది.