1823 మార్చి 07
విలియం వార్డ్ (1769–1823) ఇంగ్లాండు దేశము నుండి ఇండియాకు వచ్చిన బాప్టిస్ట్ మిషనరీ. ఈయన, విలియం క్యారీ, జాషువా మార్ష్ మాన్ లతో పాటు సెరాంపూర్ త్రయం యొక్క ముఖ్య సభ్యుడు. బైబిళ్లు, కరపత్రాలు, క్రైస్తవ సాహిత్యం, విద్యా పుస్తకములు, బహుళ భారతీయ భాషలలో ముద్రించటం, ప్రచురణకర్తగా అందుబాటులో ఉంచడం ఈయన నైపుణ్యం ద్వారా సువార్తను వ్యాప్తి చేయడంలో సహాయపడింది. ముఖ్యంగా భారతదేశంలోనే ప్రధానమైన బెంగాల్లోని సెరాంపూర్ మిషన్లో ప్రింటింగ్ వ్యవస్థను కీలకంగా ఈయనే నిర్వహించేవాడు. ఇంతకు మించి ఈయన క్రైస్తవ మతాన్ని బోధించడం, వ్యాప్తి చేయడంలో చురుకుగా నిమగ్నమయ్యాడు. హిందూ ఆచారాలు, సంప్రదాయాలపై తన లోతైన అధ్యయనం భారతీయ ప్రజలకు క్రైస్తవ బోధనలను మరింత ప్రభావవంతంగా తెలియజేయడానికి వీలు కల్పించింది.