• జూన్ 5, 1661

    జూన్ 5, 1661

    ఆంగ్ల గణిత, భౌతిక శాస్త్ర వేత్త ఐజాక్ న్యూటన్ ఈ రోజు కేంబ్రిడ్జ్ లోని ట్రినిటీ కళాశాలలో చేరాడు. ఐతే ప్రపంచంలోనే అత్యంత గొప్ప మేధావిగా పేరు గాంచిన ఈ శాస్త్రవేత్త సైన్స్ కంటే థియాలజినే ఎక్కువ చదివాడు. బైబిల్ విషయాల పైన ఈయన 13 లక్షల పదాల సంపుటాలు రాశారు అన్నది విశేషం!

    Read More

  • మే 30, 1431

    మే 30, 1431

    ఈ రోజు ఫ్రెంచ్ సైనికాధికారి జోన్ ఆఫ్ ఆర్క్ ను పురుష వస్త్రాలు ధరిస్తుందన్న నెపంతో గుంజకు కట్టి సజీవ దహనం చేశారు. 1431 మార్చి నెలలోని విచారణలో ఆమె కేథోలిక సంఘ ఆచారాలను పాటించటం లేదని ఆమెపై మతభ్రష్ట కేసు నమోదు చేసి, ఇకపై ఎప్పుడూ స్త్రీ వేషధారణ లోనే ఉండాలని ఆజ్ఞాపించారు. ఆమె అందుకు ఒప్పుకుంది. ఐతే కొన్ని రోజుల తర్వాత మరల పురుష వేషం వేసిందన్న అభియోగంతో ఆమెను…

    Read More

  • 1453, మే 29

    1453, మే 29

    రవి అస్తమించని రోమ్ సామ్రాజ్య కీర్తి శిఖరంలో మకూటయమానంగా ఉన్న కాన్స్టాంటినోపుల్ మహా నగరం కుప్పకూలిన రోజు. నాటి రోమ్ సామ్రాజ్యాధినేత కాన్స్టెంటైన్ క్రీ.శ. 324లో స్థాపించిన రాజధాని నగరమిది. రెండో సుల్తాన్ మహమ్మద్ నాయకత్వంలోని ఒట్టోమన్ సైన్యం ఏప్రిల్ 6న ఈ నగరాన్ని ముట్టడి చేసింది. యుద్ధం యాభై మూడో రోజున, 1453 మే 29న శత్రు సైన్యం స్వాధీనం చేసుకోవడంతో ఈ నగర వైభవ చరిత్ర ముగిసిపోయింది.

    Read More

  • మే 28, 1403

    మే 28, 1403

    ఈరోజు జాన్ విక్లీఫ్ సిద్ధాంతాలను వ్యాపింప చేస్తున్న జాన్ హస్ మొదలైన వారికి జర్మన్ యునివర్సిటీ పండితుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది.

    Read More