వెరిటాస్ క్లాసులు నాకు దేవుడిచ్చిన బహుమతి. ఇక్కడ నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. సంఘ పరిచర్య, సంఘ నిర్వహణ, కుటుంబ, వ్యక్తిగత సవాళ్లలో బైబిల్ ప్రకారం ఎలా నడవాలి, బైబిల్ ను సరైన రుజువులతో ప్రజలకు ఎలా చెప్పాలి, దర్బోధలను ఎలా ఎదిరించాలి వంటివి ఎన్నో తెలుసుకున్నాను. ముఖ్యంగా, క్రీస్తు బ్రతకడం తెలిసింది. పాస్టర్లు, పెద్దలు, కుటుంబం, స్నేహితుల కంటే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకున్నాను.
-
Vikram Janga, Hyderabad
Veritas Bible Institute taught me how to read and interpret the Bible in a right manner. I have learnt many deeper spiritual truths at Veritas. The curriculum is comprehensive and contemporary and is relevant to the need of the hour. It is taught in a simple but systematic approach.
-
సుందర్, కాకినాడ
నేను వెరిటాస్ ఇన్స్టిట్యూట్ కి వచ్చిన తర్వాత సత్య వాక్యాన్ని చాలా క్షుణ్ణంగా తెలుసుకున్నాను. ముఖ్యంగా క్రీస్తు సిలువలో చేసిన త్యాగం, క్రైస్తవ జీవన విధానం, సమాజంలో చొరబడిన అబద్ధ బోధలు, బోధకులను ఎలా గుర్తించాలి, వాక్యాన్ని ఏ విధంగా చదవాలి, దానిని మన జీవితంలో ఏ విధంగా అలవర్చుకోవాలి, ఇతరులకు ఎలా పరిచయం చేయాలి, దేవుడు మన కోసం ఏం చేసాడు, మనం దేవుని కోసం ఏం చేయాలి… ఇలా ఎన్నో సత్యాలు తెలుసుకున్నాను. సత్య వాక్యాన్ని నాలో నింపి, నాకు నేర్పించి, నా వ్యక్తిగత జీవితానికి నా కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్న వెరిటాస్ వేద పాఠశాలకు నా ధన్యవాదాలు!
-
జీ. ఆర్. కిషోర్, కావలి
“All truth is God’s truth” అనే నినాదంతో వచ్చిన Veritas మా అందరికీ చేరువై మా జీవితాలను సత్యంతో నింపి మమ్మల్ని ధన్యుల్ని చేసింది. ఈ రోజుల్లో సత్యానికి సరైన భాష్యం చెప్పడంలో Veritas కు ఏదీ సాటి లేదనేది సత్యం. ప్రకాష్ గారు బైబిల్ ప్రబోధంతో మా హృదయాల్లో ప్రభువును ప్రతిష్టించిన వైనం ప్రశంసనీయం.