• Mrs. Prasanna Sravan, Nellore

    Undoubtedly, Veritas Bible Institute helped me a lot in interpreting the Word of God rightly. Group discussions and review classes gave me a boost. On the whole, it stands unique in imparting systematic study of the Bible and a wide range of topics that aid right analysis. I thank God for the Veritas.

  • శ్రీమతి సురేఖ, కావలి

    నేను ఒకప్పుడు అన్యురాల్ని. రక్షణ పొందిన ఐదేళ్లకు వెరిటాస్ బైబిల్ స్కూల్లో చేరే అవకాశం దేవుడు కల్పించాడు. దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలనే తపనతో ఉన్న రోజుల్లో వెరిటాస్ పరిచయం అయ్యింది. ప్రకాష్ అన్న క్లాసుల్లో దేవుని ఉనికి, సంపూర్ణ స్వభావం ఆయన ప్రేమ, పవిత్రత ఇలా ఎన్నో గొప్ప సంగతులను నేర్చుకునే భాగ్యం దొరికింది. నశించి పోతున్న నన్ను వెదికి, విముక్తి చేయడానికి వచ్చిన ఆ క్రీస్తు ప్రేమను నేను వెరిటాస్ ద్వారా సంపూర్తిగా గ్రహించాను. ఈ రోజు నేను వాక్యంలో బలపడి, దేవునికి దగ్గరగా జీవించడానికి వెరిటాస్ కారణం. పేరుకు తగ్గట్టే వెరిటాస్ లో సత్య వాక్య ప్రబోధం జరుగుతోంది. ఈ తర్ఫీదు వల్ల నేను కొందరు స్త్రీలకు వాక్య ప్రబోధం చేయడానికి దేవుడు సాయం చేశాడు.

  • అజయ్ కుమార్, విశాఖపట్నం

    నేను వెరిటాస్ సభ్యుడుగా ఉన్నందుకు చాలా ఆనందంగా వుంది. ఈ కళాశాలలో ప్రకాష్ అన్న బోధించిన విధానం ద్వారా నాకు దేవుని వాక్యం లోతుగా చదవడం అలవాటుగా మారింది. ప్రశ్నించే పరిసయ్యలకు, శాస్త్రులుకు ప్రభువు ఎదురు ప్రశ్నల ద్వారా ఎలా జవాబు చెప్పారో వెరిటాస్ లో నేర్చుకున్నాను. ముఖ్యంగా ఈ పాఠశాలలో దేవుని వాక్యంలో ఎంతో బలపడ్డాను. దేవునికి స్తోత్రం, మహిమ!